Asianet News TeluguAsianet News Telugu

ఉపముఖ్యమంత్రి గడపగడపకు కార్యక్రమంలో అపశృతి... పురుగుల మందు తాగిన మహిళ

చిత్తూరు : ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. 

First Published Feb 1, 2023, 1:47 PM IST | Last Updated Feb 1, 2023, 1:47 PM IST

చిత్తూరు : ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంమారేపల్లి గ్రామంలో గడపగడప కార్యక్రమంలో పాల్గొన్న నారాయణస్వామిని అభివృద్ది, సంక్షేమం, సమస్యల గురించి ప్రశ్నిస్తూ ప్రజలు, జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఒక్కసారిగా పురుగుల మందు తాగింది. అస్వస్థతకు గురయిన మహిళను అక్కడే వున్నవారు హాస్పిటల్ కు తరలించారు.