హోం కంపోస్టింగ్ చేస్తున్న మహిళ ఇంటికెళ్లి ప్రశంసించిన విజయవాడ కమిషనర్
నగరంలో ఇంటి వద్దనే ఎరువును తయారు చేసే విధానాన్ని అలాగే ఇంటి వద్దనే చెత్త వేరు చేసే విధానంపై విజయవాడ నగర పౌరులకు అవగాహన పెంచుతున్నారు.
నగరంలో ఇంటి వద్దనే ఎరువును తయారు చేసే విధానాన్ని అలాగే ఇంటి వద్దనే చెత్త వేరు చేసే విధానంపై విజయవాడ నగర పౌరులకు అవగాహన పెంచుతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వహించిన ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 స్వచ్ఛతాహి సేవా లో భాగంగా వారు నిర్వహించిన ఇన్వైట్ యువర్ కమిషనర్ పోటీలలో కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గారు పున్నమ తోట లో నివాసం ఉంటున్న కె.సుబ్బలక్ష్మీ ఇంటి ఆవరణలో వ్యర్ధపదార్దములు ఉత్పత్తి అయ్యే ప్రాంతమునందే సేంద్రియ ఎరువుగా మార్చే కంపోస్టింగ్ విధానమును హోం కంపోస్టింగ్ చేస్తున్న మహిళలను గుర్తించి పూల మొక్కను అందించి కమిషనర్ అభినందించటం జరిగినది.