ఏపీలో విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు 100 శాతం కరక్ట్ : సిపిఐ నారాయణ
ఆంధ్ర ప్రదేశ్ రోడ్లలో గతుకులు,గుంతలు మీద, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తానంటున్నారు సిపిఐ నారాయణ. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాదులో జరిగిన పారిశ్రామికవేత్తల పెట్టుబడుల మహాసభలో మాట్లాడుతూ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సానుకూల ప్రాంతం తెలంగాణ అని పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో లాగా అప్రకటిత విద్యుత్ కోతలు ఉండవని,గుంతల మయం అయినటువంటి ధ్వంసమైన రోడ్లు ఉండవని వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే..! కేటీఆర్ వ్యాఖ్యలను ఆంధ్ర రాష్ట్ర మంత్రులు తప్పుబడుతున్న తరుణంలో, సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాత్రం కేటీఆర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాను అని, స్వయానా ఆంధ్ర తమిళనాడు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో సందర్శించి ఆంధ్ర రోడ్ల యొక్క స్థితిగతులను తమిళనాడు రాష్ట్రం యొక్క స్థితిగతులను ఆధారాలతో సహా వివరించారు.