విజయవాడలో దారుణం ... చిన్నారి గొంతు కొరికిన వీధి కుక్కలు

విజయవాడ : హైదరాబాద్ లో చిన్నారిపై కుక్కలు దాడిచేసి చంపిన దుర్ఘటన తర్వాత పిల్లలను భయటకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. 

Share this Video

విజయవాడ : హైదరాబాద్ లో చిన్నారిపై కుక్కలు దాడిచేసి చంపిన దుర్ఘటన తర్వాత పిల్లలను భయటకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. కేవలం తెలంగాణలోనే పొరుగున వున్న మరో తెలుగు రాష్ట్రం ఏపీలోనూ కుక్కల బెడద ఎక్కువగానే వుంది. విజయవాడ నగరంలో ఈ వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా భవానిపురంలో నజీర్, జెస్సికా, చైతన్య అనే ముగ్గురు చిన్నారులు కుక్కకాటుకు గురయ్యారు. రోజురోజుకు కుక్కల దాడి ఘటనలు పెరిగిపోవడంతో విజయవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. 

Related Video