Asianet News TeluguAsianet News Telugu

అక్రమ అరెస్ట్‌లపై నిరసన: ఉండవల్లిలో చంద్రబాబు కాగడాల ప్రదర్శన ( వీడియో)

తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి అరెస్ట్‌‌లను ఖండిస్తూ ఆ పార్టీ కాగడాలతో నిరసన చేపట్టింది. ఉండవల్లిలోని చంద్రబాబు  నివాసంలో ఆదివారం సాయంత్రం ఆ పార్టీ నేతలు కాగడాలు వెలిగించి నిరసన చేపట్టారు

తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి అరెస్ట్‌‌లను ఖండిస్తూ ఆ పార్టీ కాగడాలతో నిరసన చేపట్టింది. ఉండవల్లిలోని చంద్రబాబు  నివాసంలో ఆదివారం సాయంత్రం ఆ పార్టీ నేతలు కాగడాలు వెలిగించి నిరసన చేపట్టారు.

టీడీపీ నేతల వరుస అక్రమ అరెస్ట్‌లను ఆపాలని, ప్రతిపక్షంపై కక్షను విడనాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. వీరి దీక్షకు మద్ధతుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు కాగడాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.