ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం... హెల్త్ యూనివర్సిటీ క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 

First Published Sep 21, 2022, 1:38 PM IST | Last Updated Sep 21, 2022, 1:38 PM IST

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. విజయవాడలోని యూనివర్సిటీ ప్రాంగణంలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు క్యాంపస్ లో ఆందోళన చేపట్టారు.  యూనివర్సిటీ ఆర్చ్ పై టిడిపి జెండా పెట్టడమే కాదు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ బెజవాడలో మరోసారి రక్తచరిత్ర తప్పదంటూ ఆందోళనకారులు వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు టిడిపి నాయకులను అరెస్ట్ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ క్యాంపస్ నుండి బయటకు తరలించారు.