Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఎమ్మెల్సీతో కలిసి టిడిపి ఎంపీ... శంకుస్థాపన కార్యక్రమంలో సందడి..


నందిగామ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో చైతన్య గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూటన్స్  'ఏకత్వ' పేరుతో విద్యాసంస్థ ఏర్పాటుకు సిద్దమైంది.

First Published Sep 8, 2023, 6:41 PM IST | Last Updated Sep 8, 2023, 6:41 PM IST


నందిగామ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో చైతన్య గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూటన్స్  'ఏకత్వ' పేరుతో విద్యాసంస్థ ఏర్పాటుకు సిద్దమైంది. ఈ విద్యాసంస్థ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేయగా ఈ కార్యక్రమంలో టిడిపి ఎంపీ  ఎంపీ కేశినేని నాని, వైసిపి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీ సరదాగా మాట్లాడుతూ కనిపించారు. 

ఈ సందర్భంగా ఎంపీ నాని టిడిపి చీఫ్ చంద్రబాబుకు ఐటీ నోటీసులపై స్పందించారు. భారతదేశ పాలిటిక్స్ లో కొంతమంది క్లీన్ నాయకుల్లో చంద్రబాబు ఒకరని అన్నారు. ఆయనకు ఐటీ నోటీసులు జనరల్ విషయమని... దీన్ని కొన్ని పార్టీలు పొలిటికల్ చేస్తున్నాయని అన్నారు. అసలు నిజంగానే చంద్రబాబుకు నోటీసులు వచ్చాయా? అని ఎంపీ  కేశినేని నాని అనుమానం వ్యక్తం చేసారు.