Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ముందంజ... తనదైన స్టైల్లో స్పందించిన బాలయ్య

అమరావతి:ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ ముందజలో వుండటంపై ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తనదైన స్లైల్లో స్పందించారు.

First Published Mar 17, 2023, 12:38 PM IST | Last Updated Mar 17, 2023, 12:38 PM IST

అమరావతి:ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ ముందజలో వుండటంపై ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తనదైన స్లైల్లో స్పందించారు. అసెంబ్లీ సమావేశాల కోసం వచ్చిన బాలకృష్ణను ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించాలని విలేకరులు కోరారు. అయితే బాలకృష్ణ మాత్రం ఏం మాట్లాడకుండా విజయ సంకేతాన్ని చూపి వెళ్లిపోయారు. ఇదిలావుంటే నిన్న(గురువారం) కృష్ణా జిల్లాలోని స్వగ్రామం నిమ్మకూరులో బాలయ్య సందడి చేసారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీకి వచ్చిన బాలకృష్ణ సభ నుండి సస్పెండ్ అయ్యారు.దీంతో సమయం దొరకడంతో స్వగ్రామం నిమ్మకూరును సందర్శించారు. ఈ క్రమంలో పరీక్ష రాసి వస్తున్న ఇంటర్ విద్యార్థినులను పలకరించారు. బాగా చదువుకోండని  విద్యార్థినీలను బాలకృష్ణ ఆశీర్వదించారు.సమీప బంధువులతో కొద్దిసేపు ముచ్చటించిన బాలయ్య వెనుతిరిగారు.