Asianet News TeluguAsianet News Telugu

కంచికచర్లలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం...

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. 

First Published Sep 22, 2022, 2:00 PM IST | Last Updated Sep 22, 2022, 2:00 PM IST

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇలా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలోని కంచికచర్లలో టిడిపి శ్రేణులు నిరసన తెలిపారు. కంచికచర్ల టిడిపి మండలాధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా చెవిటికల్లు సెంటర్ కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్, వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.