మూడు రాజధానుల సెగ : వైసీపీ ఎమ్మెల్యే పై 420 కేసు.. పోలీసులకు ఫిర్యాదు...
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై స్థానికులు, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై స్థానికులు, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్కేపై 420 కేసు పెట్టి విచారణ చేసి కోర్టులో కేసు ఫైల్ చేయాలని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కోరారు. ఓటర్లను, రైతులను మోసం చేసి ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. 2019 ఇది ఎన్నికల ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజక ప్రజలకు రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పారని.. రాజధాని మార్పు జరగదు వైఎస్ జగన్ తాడేపల్లిలో నివాసం ఏర్పరుచుకున్నారని మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచారని మండిపడ్డారు.