Asianet News TeluguAsianet News Telugu

టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు బెయిల్ మంజూరు...

 గుడివాడ : ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన  టిడిపి మాజీ ఎమ్మెల్యే  రావి వెంకటేశ్వర రావు కు బెయిల్ లభించింది. 

 

First Published Feb 7, 2023, 4:04 PM IST | Last Updated Feb 7, 2023, 4:04 PM IST

 గుడివాడ : ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన  టిడిపి మాజీ ఎమ్మెల్యే  రావి వెంకటేశ్వర రావు కు బెయిల్ లభించింది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నాగవరప్పాడులో అక్రమంగా నిర్మించారంటూ గుడిసెలను అధికారులు కూల్చివేయడానికి సిద్దమవడగా అనుచరులు, టిడిపి శ్రేణులతో అక్కడికి చేరుకున్న రావి అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రావిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ వైద్యపరీక్షలు నిర్వహించిన గుడివాడ న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నాగలక్ష్మి 20వేల రూపాయల సొంత పూచీకత్తుపై రావి వెంకటేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది.