Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో ఉద్రిక్తత... డిజిపి ఆఫీస్ ముట్టడికి విద్యార్థిసంఘాల ప్రయత్నం

విజయవాడ : ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో పోలీస్ ఉద్యోగాల వయోపరిమితిని మరో ఐదేళ్లు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. 

First Published Dec 12, 2022, 5:15 PM IST | Last Updated Dec 12, 2022, 5:15 PM IST

విజయవాడ : ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో పోలీస్ ఉద్యోగాల వయోపరిమితిని మరో ఐదేళ్లు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. ఆరువేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా వయోపరిమితి పెంచాలని గతకొంత కాలంగా నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడంతో నిరుద్యోగ యువతకు మద్దతుగా విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే నేడు ఏపీ డిజిపి కార్యాలయం ముట్టడికి విద్యార్థిసంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద భారీగా మొహరించిన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసారు.