అంఫాన్ తుఫాను : శ్రీకాకుళంజిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు : కలెక్టర్ నివాస్
అంఫాన్ తుఫాన్ ప్రభావంతో సోమవారం నుండి మూడు రోజుల పాటు ఖచ్చితంగా భారీ వర్షాలు పడతాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ జె. నివాస్ తెలిపారు.
అంఫాన్ తుఫాన్ ప్రభావంతో సోమవారం నుండి మూడు రోజుల పాటు ఖచ్చితంగా భారీ వర్షాలు పడతాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. రైతులు కోతలు చేపట్టవద్దని తెలిపారు. జిల్లాలో మత్స్యకారులు నాటు పడవలతో సముద్రంలోకి వెళ్లవద్దని 60 నుండి 70 కి.మి. వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. తుఫానుకు సంబంధించిన సమాచారం కోసం 08942 240557 నెం. కు కంట్రోల్ రూం ఫోన్ చేయవచ్చని తెలిపారు.