ఏపీలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు... కన్నుల పండగగా సీతారాముల కళ్యాణం

విశాఖపట్నం : శ్రీరామ నవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Share this Video

విశాఖపట్నం : శ్రీరామ నవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక వేదికను ఏర్పాటుచేసి సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇక రామాలయాల్లో సామాన్యులే కాదు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సతీసమేతంగా ఆలయానికి వెళ్లి సీతారాములను పూజించారు. ఇక విశాఖ శివారులోని శ్రీ శారదాపీఠంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు వేడుకల్లో పాల్గొన్నారు.

Related Video