Asianet News TeluguAsianet News Telugu

దారుణం: కన్నతల్లి మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వని కసాయి కొడుకు (వీడియో)

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మానవత్వం మంటగలిసే సంఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కని అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లి చనిపోతే బాధపడటం కాదు కనీసం మృతదేహాన్ని కూడా ఇంట్లోకి రానివ్వలేదు ఓ సుపుత్రుడు.  


 

First Published Jan 6, 2021, 2:11 PM IST | Last Updated Jan 6, 2021, 2:11 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మానవత్వం మంటగలిసే సంఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కని అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లి చనిపోతే బాధపడటం కాదు కనీసం మృతదేహాన్ని కూడా ఇంట్లోకి రానివ్వలేదు ఓ సుపుత్రుడు. తల్లి చనిపోయినట్లు తెలియగానే ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా చెక్కేశాడు. 

మచిలీపట్నం జిల్లాకోర్టు సమీపంలో నాగప్రసాద్ ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడి తల్లి రాజారత్నం బంటుమిల్లిలో కూతురు ఇంటికి వెళ్లి అక్కడేమరణించింది. దీంతో కుమార్తె, అల్లుడు ఆమె మృతదేహాన్ని నాగప్రసాద్ ఇంటికి తీసుకువచ్చారు. కానీ తల్లి మృతదేహాన్ని కనీసం ఇంట్లోకి కూడా తీసుకురానివ్వకుండా నాగప్రసాద్ అత్యంత కఠినంగా వ్యవహరించాడు. తల్లికి అంత్యక్రియలు చేయనంటూ ఇంటికి తాళం వేసుకున్నాడు. అంతేకాకుండా అక్క, బావ డబ్బులు కోసం తన తల్లిని చంపారంటూ చిలకపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.