వచ్చే ఎన్నికల్లో సింపతీ కోసం జగన్ షర్మిల, విజయమ్మను కూడా చంపొచ్చు : డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తాడని డీఎల్ ఆరోపించారు.
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తాడని డీఎల్ ఆరోపించారు. షర్మిల, విజయమ్మ లు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎవరినైనా గొంతు కోసి అధికారంలోకి రావాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడనే అనుమానం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రశాంత్ కిశోర్ గతంలో ఇచ్చిన ఆలోచనలు వర్కౌట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కూడా ఎవరినైనా చంపి సింపతీ మీద గెలవాలని ప్రయత్నించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కోడికత్తి, వివేకా హత్య కేసుల వల్లే జగన్ అధికారంలోకి వచ్చాడని డీఎల్ ఆరోపించాడు. డీఎల్ వ్యాఖ్యల పై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.