Asianet News TeluguAsianet News Telugu

ఎస్సై గోపాలకృష్ణది ఆత్మహత్య కాదు...: మృతుడి సోదరుడి కీలక వ్యాఖ్యలు

కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ తన సర్వీస్ రివాల్వర్ పేలి గురువారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. అతడి అంత్యక్రియలు ఇవాళ(శనివారం) ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని స్వగ్రామం నవాబ్ పేటలో జరిగాయి. కాకినాడ జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు గోపాలకృష్ణ బ్యాచ్ మేట్స్, కుటుంబసభ్యుల సమక్షంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా  గోపాలకృష్ణ మృతిపై అతడి సోదరుడు స్పందించారు. ఇది ఆత్మహత్య కాదని... మిస్ ఫైర్ వల్లనే జరిగిందని అనుమానిస్తున్నామని అన్నారు. సోదరుడి మృతికి అధికారులు వేధింపులు, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు కారణమని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వృత్తిపరంగానే కాదు ఆర్థికంగానే తన సోదరుడికి ఎటువంటి సమస్యలు లేవన్నారు. అసలేం జరిగింది అనేదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని... వారిపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని గోపాలకృష్ణ సోదరుడు పేర్కొన్నారు. 

First Published May 14, 2022, 2:24 PM IST | Last Updated May 14, 2022, 2:24 PM IST