ఘనంగా ఆంధ్రప్రదేశ్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..అందరిని ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన ...

ఆంధ్రప్రదేశ్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ బిశ్వభూషన్.. పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో అక్కడ ఏర్పాటు చేసిన పరేడ్‌ను పరిశీలించారు. వేడుక సందర్భం గా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంది..తరువాత గవర్నర్ ప్రసంగించారు...

Related Video