అనకాపల్లిలో ఘోరం... ఫార్మా కంపనీ అగ్నిప్రమాదంలో కార్మికులు మృతి

అనకాపల్లి : ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు కొనసాగుతూనే వున్నాయి. 

Share this Video

అనకాపల్లి : ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని జీఎఫ్ఎంఎస్ ఫార్మా కంపనీలో పేలుడు చోటుచేసుకుంది. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో భారీ శబ్దంతో పాటు మంటలు వ్యాపించారు. దీంతో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుతో భయాందోళనకు గురయిన కార్మికులు బయటకు పరుగు తీసారు. 

రియాక్టర్ పేలుడుపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫార్మా కంపనీ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన కార్మికులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Related Video