విద్యార్థిసంఘాల ఛలో రాజ్ భవన్... విజయవాడలో ఉద్రిక్తత

విజయవాడ: రాయలసీయ యూనివర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్‌ చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తంగా మారింది.  

First Published May 14, 2022, 3:19 PM IST | Last Updated May 14, 2022, 3:19 PM IST

విజయవాడ: రాయలసీయ యూనివర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్‌ చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తంగా మారింది.  రాజ్ భవన్ ముట్టడిస్తామని విద్యార్థి సంఘాలు ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్టు అమలు చేయడంతో పాటు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ క్రమంలోనే రాజ్ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను గాంధీ నగర్ అలంకార్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థి సంఘ నేతలను బలవంతంగా అరెస్ట్ చేసారు పోలీసులు.