Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేట్ స్కూలు నిర్వాకం.. స్కూలు పిల్లలతో పలుగు, పార పట్టించి పనులు..

కృష్ణాజిల్లా : ఉయ్యూరు కాటూరు రోడ్డులోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం పిల్లలతో పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది.

కృష్ణాజిల్లా : ఉయ్యూరు కాటూరు రోడ్డులోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం పిల్లలతో పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ, పసిపిల్లలతో పలుగు, గడ్డపారలతో పనులు చేస్తూ..  బండ రాళ్లు మొయిస్తున్నారు. తమ పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నారనుకుంటున్న తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఏం సమాధానం చెబుతారని ఇది చూసిన వారు అంటున్నారు. 

ఇదేకాదు.. ఈ పాఠశాల కింద ఫ్లోర్ లో ఒక ప్రైవేట్ హోటల్, ఒక లాడ్జి కూడా నడుపుతున్నారు.హోటల్ లో ఎప్పుడైనా ఫైర్ ఆక్సిడెంట్ అయితే పిల్లలు కిందకి వచ్చే ఆస్కారం కూడా లేకుండా చిన్న మెట్ల మార్గం ఉంది. దీనిమీద అధికారులు ఎలా స్పందిస్తారు, ఏం చర్యలు తీసుకుంటారో అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.