Asianet News TeluguAsianet News Telugu

మరో వివాదంలో జేసీ..ఫోర్జరీ సంతకాలతో దివాకర్ ట్రావెల్స్ బురిడీ...

పోలీసుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ సీళ్లతో NOC పొంది లారీలు విక్రయించిన ముఠా గుట్టును తాడిపత్రి పోలీసులు రట్టు చేశారు.

Feb 7, 2020, 11:04 AM IST

పోలీసుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ సీళ్లతో NOC పొంది లారీలు విక్రయించిన ముఠా గుట్టును తాడిపత్రి పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుండి లాప్ టాప్, థంబ్ డివైజర్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం  చేసుకున్నారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం సూచనలతో, భరోసాతో ఈ అక్రమాలకు ఒడిగట్టినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ ముఠాలో మరి కొందరు నిందితులుగా ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేయనున్నారు.