Asianet News TeluguAsianet News Telugu

గోదావరి నదిలో నాటుపడవల్లో ప్రయాణించి... నాటుసారా తయారీ ముఠా పట్టివేత

Jul 11, 2021, 6:07 PM IST


గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో గుట్టుగా సాటుసారా తయారుచేస్తున్న కేంద్రాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. నదిలో నాటుపడవలపై ప్రయాణించి మారుమూల ప్రాంతాలకు చేరుకున్న అధికారులు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోంగూర లంక, ముద్దురులంక గ్రామాల్లోని 5 వెలుగుతున్న బట్టీలను, 11,200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడంతో పాటు 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ముగ్గురు ముద్దాయిలను అదుపులోనికి తీసుకున్నారు. సదరు ముద్దాయిలు పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.