తన నివాసంలో కేక్ కటింగ్... ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుక జరిపిన సోము వీర్రాజు
అమరావతి: ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు తన నివాసంలో వేడుకలు నిర్వహించారు.
అమరావతి: ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు తన నివాసంలో వేడుకలు నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసంలో కేక్ కట్ చేసిన సోమువీర్రాజు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మోదీ పుట్టినరోజు వేడుకలు ప్రారంభించాలని బిజెపి శ్రేణులకు సూచించారు.
ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ... భారత దేశంలో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ను కనిపెట్టడానికి శాస్త్రవేత్తల్లో మనోధైర్యాన్ని నింపింది ప్రధాని మోదీనే అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వివిధ రకాల ఔషధాలు, ఉత్ప్రేరకాలు దేశంలోనే తయారుచేసే విధంగా ఫార్మాసిటి కంపెనీలకు ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు.