అప్పుడు భూసేకరణను వ్యతిరేకించా, ఇప్పుడు రాజధాని తరలింపును ప్రశ్నిస్తున్నా: పవన్ కళ్యాణ్ (వీడియో)
అమరావతిలో రాజధాని వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రాజధాని వద్దంటూ తాను అన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాను అమరావతిలో రాజధానిని వ్యతిరేకించలేదన్నారు. కానీ రాజధాని భూ సేకరణను మాత్రమే తాను అప్పట్లో వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. ఈ విషయాలను మంత్రి బొత్స సత్యనారాయణ తెలుసుకోవాలని సూచించారు.

అమరావతిపై అవసరం అయితే ప్రధాని నరేంద్రమోదీని సైతం కలుస్తానని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అమరావతి ప్రజారాజధాని కావాలని డిమాండ్ చేశారు. అమరావతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు.