ఢిల్లీలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు హవా మామూలుగాలేదు | PM Modi Interacts with Chandrababu, Pawan Kalyan

Galam Venkata Rao  | Published: Feb 20, 2025, 2:01 PM IST

PM Modi Interaction With Chandrababu Naidu, Pawan Kalyan in Delhi CM Rekha Gupta swearing-in Ceremony: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత రాంలీలా మైదానంలో ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ప్రమాణానికి ఏర్పాటు చేశారు. ఢిల్లీ 9వ ముఖ్యమంత్రి, 4వ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వీరికి అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను వేదికపై ప్రత్యేకంగా పలకరించారు.

Read More...