వినుకొండ డీసీసీబీలో సిబ్బంది చేతివాటం.. రూ.2 కోట్లు స్వాహా...

పల్నాడు జిల్లా : వినుకొండ బ్రాంచ్‌లో డ్వాక్రా రుణాలను ఓ ఉద్యోగి తన ఖాతాలోకి వేసుకున్న సంఘటన వెలుగుచూసింది. 

First Published Oct 1, 2022, 9:51 AM IST | Last Updated Oct 1, 2022, 9:51 AM IST

పల్నాడు జిల్లా : వినుకొండ బ్రాంచ్‌లో డ్వాక్రా రుణాలను ఓ ఉద్యోగి తన ఖాతాలోకి వేసుకున్న సంఘటన వెలుగుచూసింది. రెండేళ్లుగా సాగిన ఈ వ్యవహారంలో సుమారు రూ.2 కోట్లవరకు స్వాహా చేశాడు. బ్రాంచ్‌లో కీలకబాధ్యతల్లో ఉన్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి  డ్వాక్రా గ్రూపుల పేరిట పోర్జరీ సంతకాలతో రుణాల దరఖాస్తులు చేసేవాడు. వాటికి సొంత ఖాతాకు, మరికొన్ని కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేసుకుంటూ ఉండేవాడు. బయటపడకుండా రన్నింగ్‌ రుణాల పేరుతో కొత్త రికార్డులను తనపరిధిలోనే ఉంచుకుని రెండేళ్ల పాటు ఈ కుంభకోణాన్ని కొనసాగించాడు. మూడు నెలలకొకసారి కొంత సొమ్ము నమోదు చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చేసేవాడు. ఇటీవల నాబార్డు ఆడిటర్ల హెచ్చరికతో బ్రాంచ్‌ నోడల్‌ అధికారులు డ్వాక్రా రుణాలపై దృష్టిపెట్టగా వినుకొండ బ్రాంచ్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి చేతివాటం వెలుగుచూసింది. దీంతో నాలుగు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. డ్వాక్రా రుణాల పంపిణీలో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులతో ఇద్దరు మేనేజర్లను బదిలీ చేశారు.