విశాఖ ఆన్లైన్ జాబ్స్ మోసాలు... 2.5 కోట్లు దోచుకున్న రాజస్థాన్ ముఠా

విశాఖపట్నం : ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు... ఇంట్లోనే వుంటూ ఆన్లైన్ లో పార్ట్ టైం జాబ్స్ చేసుకుని సంపాదించుకోవచ్చంటూ అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను విశాఖపట్నం పొలీసులు అరెస్ట్ చేసారు.

First Published Dec 29, 2022, 10:50 AM IST | Last Updated Dec 29, 2022, 10:50 AM IST

విశాఖపట్నం : ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు... ఇంట్లోనే వుంటూ ఆన్లైన్ లో పార్ట్ టైం జాబ్స్ చేసుకుని సంపాదించుకోవచ్చంటూ అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను విశాఖపట్నం పొలీసులు అరెస్ట్ చేసారు. రాజస్థాన్ లోని బిల్వ జిల్లాకు చెందిన యువకులు ఇలా ఆన్లైన్ జాబ్స్ పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు విశాఖ సిపి శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటివరకు ఈ ముఠా వలలో పడిన 78 మంది 2.5 కోట్లు నష్టపోయారని... వీరలో ఎక్కువగా గృహిణులే వున్నారని సిపి వెల్లడించారు. 

ఇలా డబ్బుల ఆశ చూపించి మోసాలకు పాల్పడే ముఠాలతో అప్రమత్తంగా వుండాలని విశాఖ పోలీస్ కమీషనర్ సూచించారు. పని చేయకుండానే జీతాలు ఇస్తామంటే ఆశ పడొద్దని... వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమివ్వాలని సిపి శ్రీకాంత్ సూచించారు.