భూమా అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం.. పీఎస్ కు వచ్చి హత్య కేసు నిందితుడిని....
ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో ఓ పొలంలోని ప్రభుత్వ రస్తా విషయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో ఓ పొలంలోని ప్రభుత్వ రస్తా విషయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి చెందిన శూలం నరసింహ అదే గ్రామానికి చెందిన వైసీపీ లీడర్ సుధాకర్ రెడ్డిని బైక్ తో గుద్ది చంపడానికి ప్రయత్నించాడని సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో శూలం నరసింహను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎంక్వయిరీ కోసం పోలీసులు పడకల గ్రామానికి వెళ్లగా ఆ సమయంలో భూమా విఖ్యాత్ రెడ్డి స్టేషన్కు వచ్చి ఎవరికీ చెప్పకుండా శులం నరసింహను తీసుకుపోయాడు. దీంతో పోలీసులు భూమా విఖ్యాత్ రెడ్డి పై సెక్షన్ 253,224,225,212 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటివద్ద ఉన్న శులం నరసింహను అరెస్ట్ చేశామని ఆళ్ళగడ్డ పట్టణ సి.ఐ. సుబ్రమణ్యం తెలిపారు.