Asianet News TeluguAsianet News Telugu

నా భూమిని కబ్జా చేశారు... దయచేసి న్యాయం చేయండి: సినీనటుడు శివ ఆందోళన

Sep 16, 2021, 12:38 PM IST

గుంటూరు: గత పదకొడేళ్లుగా తన భూమిని అప్పనంగా అనుభవించడమే కాదు... చివరకు లీజుకు ఇవ్వకుండా, అమ్ముకోకుండా తన బావే అడ్డుతగులుతున్నాడని సినీ ఆర్టిస్ట్ శివరాత్రి వెంకటనారాయణ(శివం) ఆవేదన వ్యక్తం చేశాడు. గుంటూరు జిల్లాలో దాచేపల్లి మండలం నడికూడి ఇండస్ట్రీ ఏరియాలోని ముగ్గుమిల్లు గేటు ఎదురుగా తమ స్థలంలో భార్యతో కలిసి బైఠాయించి శివ నిరసనకు దిగాడు. తనకు న్యాయం చేయాలంటూ స్పందన కార్యక్రమంలో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ, స్థానిక ఎస్సైకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అంతేకాకుండా పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా వినకుండా తనను బావ పల్లపు వెంకటేశ్వర్లు బెదిరింపులకు గురి చేస్తున్నారని శివ ఆవేదన వ్యక్తం చేశారు . తనకు అన్యాయం చేయాలని సొంత బావే చూస్తున్నాడని... ఎక్కడా న్యాయం జరగడం లేదని ఆర్టిస్ట్ శివ ఆవేదన వ్యక్తం చేశారు.