పెడన వైసిపిలో వర్గపోరు... మంత్రి జోగి, మహిళా నాయకురాలి వర్గీయుల ప్లెక్సీ గొడవ
కృష్ణా జిల్లా వైసిపిలో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. ఈనెల 25న పెడనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ కోసం వైసిపి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.
కృష్ణా జిల్లా వైసిపిలో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. ఈనెల 25న పెడనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ కోసం వైసిపి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మంత్రి జోగి రమేష్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఉప్పాల హరిక వర్గీయుల మధ్య ప్లెక్సీల వివాదం రేగింది. హారిక వర్గీయులు సీఎం జగన్ కు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు కడుతుండగా మంత్రి జోగి వర్గీయులు అడ్డుకున్నారు. మేము కట్టకుండా మీరెలా కడతారంటూ మంత్రి వర్గీయులు... మేము కడతామంటూ హారిక వర్గీయులు వాగ్వావాదానికి దిగారు. చివరకు ఇరువర్గాలు బాహాబాహీకి సిద్దమవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించిన అక్కడినుండి పంపించారు. ఇరు వర్గాల ఘర్షణలో ఉప్పాల హారిక వర్గానికి చెందిన ఒక యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులతో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, మంత్రి జోగి రమేష్ అనుచరుల ఫ్లెక్సీలను తొలగించి ట్రాక్టర్లలో మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.