
Minister Gottipati Ravi Kumar Speech: మంత్రి నారాయణపై గొట్టిపాటి ప్రశంసలు
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని పీవీఆర్ స్కూల్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొని మాట్లాడారు. అన్నీ దానాల్లో కల్లా విద్యాదానం చాలా గొప్పదన్నారు. నెల్లూరులో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మంత్రి నారాయణ వీఆర్సీ పాఠశాలను నిర్మించారని ప్రశంసించారు. అన్నీ ప్రభుత్వాలే చేసే వరకు ఎదురు చూడక.. వ్యక్తులు కూడా సమాజాభివృద్ధికి చొరవ చూపాలనీ పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొస్తే గ్రామీణ విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.