మాది ప్రజా సంక్షేమ బడ్జెట్... పేదలకు మేలుచేసే బడ్జెట్ : బొత్స సత్యనారాయణ

అమరావతి : ఇవాళ వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ వార్షిక బడ్జెట్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. 

Share this Video

అమరావతి : ఇవాళ వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్ర ప్రదేశ్ వార్షిక బడ్జెట్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. ఇది సంక్షేమ బడ్జెట్... ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే బడ్జెట్... పేదలను కోసం ఆలోచించి రూపొందించిన బడ్జెట్ అని అన్నారు. విద్యా, వైద్యానికి బడ్జెట్ లో పెద్దపీట వేసారని అన్నారు. ఒక్క విద్యా రంగానికే ఏకంగా రూ.32వేల కోట్లు కేటాయించారంటేనే పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎంతలా ప్రయత్నిస్తుందో అర్థమవుతుందని అన్నారు. సామాన్యులకు సంక్షేమం అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారని అన్నారు. గత ప్రభుత్వం పాలించిన ఐదేళ్లు ఆకలి చావులు, ఆత్మహత్యలు చూసాం... కానీ ఈ నాలుగేళ్ల వైసిపి పాలనలో ప్రజల సంతోషాన్ని చూస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. 

Related Video