పల్నాడు కలెక్టరేట్ ముందు బాధితుడి ఆత్మహత్యాయత్నం...

నరసరావుపేట : వైసిపి నాయకులు తనకు అన్యాయం చేసి కుటుంబాన్ని రోడ్డున పడేసారని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఓ బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Share this Video

నరసరావుపేట : వైసిపి నాయకులు తనకు అన్యాయం చేసి కుటుంబాన్ని రోడ్డున పడేసారని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఓ బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నరసరావుపేట ఆర్టిసి బస్టాండ్ లో తనకు కేటాయించిన దుకాణాన్ని వైసిపి నాయకులు ఖాదర్ బాషా, కోటిరెడ్డి తొలగించారని షేక్ రెహమాన్ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ముందే అందరూ చూస్తుండగా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రెహమాన్ ఆత్మహత్యాయత్నం సమయంలోనే నరసరావుపేట టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు, మరికొందరు నాయకులు  స్పందన కార్యక్రమం కోసం కలెక్టరేట్ కు వచ్చారు. దీంతో రెహమాన్ ఆత్మహత్యాయత్నం గురించి కలెక్టర్ కు తెలిపిన చదలవాడ అతడికి న్యాయం చేయాలని కోరారు. నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు మితిమీరిపోయాయని చదలవాడ పేర్కొన్నారు. 

Related Video