Asianet News TeluguAsianet News Telugu

సాలరీ అకౌంట్లోంచి లక్షలు మాయం... ఏకంగా డిఈవోనే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

మచిలీపట్నం : అమాయకులనే కాదు ఉన్నత విద్యావంతులను సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు.

మచిలీపట్నం : అమాయకులనే కాదు ఉన్నత విద్యావంతులను సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా డిఈవో (జిల్లా విద్యశాఖ అధికారి) తాహిరా సుల్తానాను కూడా సైబర్ కేటుగాళ్లు మోసం చేసారు. ఆమె సాలరీ అకౌంట్ (ఎస్బిఐ బ్యాంక్) నుండి గత ఏడాదికాలంగా పలు దఫాలుగా డబ్బులు మాయం చేసారు. ఇలా మొత్తంగా 4,90,000 రూపాయలను డిఈవో అకౌంట్ నుండి తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. 

సైబర్ నేరగాళ్ల మోసాన్ని గుర్తించిన డిఈవో అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలపూడి పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా వుండాలని... బ్యాంక్ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, ఫోన్ కు వచ్చే ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. 

Video Top Stories