Asianet News TeluguAsianet News Telugu

కోటంరెడ్డి లాంటివాడు పోతే వైసిపికి పోయేదేమీ లేదు..: కొడాలి నాని

తాడేపల్లి : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాంపింగ్, టిడిపిలో చేరిక ప్రకటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. 

First Published Feb 2, 2023, 12:29 PM IST | Last Updated Feb 2, 2023, 12:29 PM IST

తాడేపల్లి : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాంపింగ్, టిడిపిలో చేరిక ప్రకటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. వైసిపిని వీడాలని నిర్ణయించుకున్న కోటంరెడ్డి పోన్ ట్యాంపింగ్ అంటూ నాటకాలాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చే పదవి కోసమే ఇంత కాలం ఆదరించిన పార్టీపై కోటంరెడ్డి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని... ఇలాంటివాడు పోయినంత మాత్రాన వైసిపికి పోయేదేమీ లేదన్నారు. పార్టీలోంచి పోవాలి అనుకున్న వాడు ఎలాగైనా పోతాడు... కాకపోతే ఏదో కారణం కావాలి కాబట్టే ఈ ట్యాపింగ్ ని తెరమీదకు తెచ్చాడన్నారు. కోటంరెడ్డి పోతే రేపే  మరొకరిని ఇంచార్జీగా నియమిస్తామని... అతడే గడపగడపకు తిరుగతాడని కొడాలి నాని అన్నారు.