Asianet News TeluguAsianet News Telugu

మాజీ సీఎం ఎన్టీఆర్ చావుపైనా సిబిఐ విచారణ జరపాలి : కొడాలి నాని డిమాండ్

గుడివాడ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NTR) మృతిపై సిబిఐ విచారణ జరపాలంటూ మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండ్ చేసారు.

గుడివాడ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NTR) మృతిపై సిబిఐ విచారణ జరపాలంటూ మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండ్ చేసారు. గతంలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కూడా తండ్రి మృతిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేసారని నాని గుర్తుచేసారు. కాబట్టి ఎన్టీఆర్ మృతిపై అనుమానాలు తొలగిపోవాలంటే ఇప్పటికయినా సిబిఐ విచారణ జరపాలని మాజీ మంత్రి కోరారు. 

ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సిబిఐ విచారణను తమ రాజకీయ ప్రయోజనాల కోసం టిడిపి వాడుకుంటోందని కొడాలి నాని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య సమయంలో సీఎంగా నువ్వే వున్నావు... అప్పుడే  ముద్దాయిలను ఎందుకు పట్టుకోలేదు?... 420 నా కొడుకువు కాబట్టా... లేక వివేకా హత్యతో నీ ప్రమేయం వుంది కాబట్టా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన రోజు చంద్రబాబుతో కడప జిల్లా నాయకులు, ఇంటెలిజన్స్ డిజి వెంకటేశ్వరరావు ఏం మాట్లాడారు? ఆనాటి జిల్లా ఎస్పీ డిజిపితో, చంద్రబాబుతో లోకేష్ ఫోన్ లో ఏం మాట్లాడారో కూడా సిబిఐ విచారణ జరపాలని కొడాలి నాని డిమాండ్ చేసారు