విశాఖ భూములపై విజయసాయి కన్ను... దసపల్లా భూములు కాపాడండి : జనసేన ఆందోళన

విశాఖపట్నం నడిబొడ్డున వేల కోట్ల విలువచేసే దసపల్లా భూములను అధికార అండతో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి కాజేయాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

Share this Video

విశాఖపట్నం నడిబొడ్డున వేల కోట్ల విలువచేసే దసపల్లా భూములను అధికార అండతో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి కాజేయాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ దసపల్లా భూములను ప్రభుత్వ ఆధీనంలోనే వుంచుకుంటూ 22(ఏ) జాబితాలోనే కొనసాగించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటూ విశాఖ కలెక్టరేట్ వద్ద జనసేన నాయకులు నిరసన చేపట్టి స్పందనలో ఫిర్యాదు చేసారు. దసపల్లా భూములను తన కూతురు, అల్లుడు కంపనీలకు దక్కేలా విజయసాయి పావులు కదుపుతున్నాడని... అందుకోసమే వీటిని 22(ఏ) జాబితా నుండి ఎత్తివేసే దిశగా వైసిపి ప్రభుత్వ నిర్ణయాలున్నాయని జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Related Video