Asianet News TeluguAsianet News Telugu

పెనుగంచిప్రోలులో ఘనంగా ప్రారంభమైన తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ళు

జగ్గయ్యపేట : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో  తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. 

జగ్గయ్యపేట : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో  తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ తిరునాళ్లు ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. దేవాలయ ప్రధాన అర్చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అఖండ జ్యోతి వెలిగించి తిరుణాలను ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం జరిగనున్న తిరుపతమ్మ కళ్యాణోత్సవానికి ఆలయ కమిటీ, అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.