భీమవరంలో భారీ వర్షం... రేపటి ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లకు ఆటంకం
భీమవరం : స్వాతంత్ర్య సమరయోధులు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కోసం ప్రధాని నరేంద్ర మోదీ రేపు (సోమవారం) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
భీమవరం : స్వాతంత్ర్య సమరయోధులు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల కోసం ప్రధాని నరేంద్ర మోదీ రేపు (సోమవారం) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భీమవరంలోని ఏఎస్‌ఆర్ పార్కులో రూ.30 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన 30 అడుగుల ఎత్తైన అల్లూరి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం, క్షత్రియ సేవా సమితి భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏర్పాట్లకు వర్షం ఆటంకం కలిగిస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రధానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన కటౌట్లు కూలిపోయాయి. అలాగే బహిరంగ సభకోసం ఏర్పాటుచేసిన షెడ్లలోకి వర్షపు నీరు పనులకు ఆటంకంగా మారింది.