Asianet News TeluguAsianet News Telugu

ప్రాణాలు పోయేలావున్నా ట్రీట్మెంట్ ఇవ్వరట...: గుంటూరు ప్రభుత్వాస్పత్రి సెల్ఫీ వీడియో కలకలం

గుంటూరు : ప్రభుత్వ హాస్పిటల్స్ అంటేనే నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ అనేలా ప్రజల్లో ముద్రపడిపోయింది. అయితే ప్రజల్లో ప్రభుత్వాస్పత్రిపై వున్న అభిప్రాయాన్ని తొలగించి మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా సిబ్బంది మాత్రం మారడం లేదు.

గుంటూరు : ప్రభుత్వ హాస్పిటల్స్ అంటేనే నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ అనేలా ప్రజల్లో ముద్రపడిపోయింది. అయితే ప్రజల్లో ప్రభుత్వాస్పత్రిపై వున్న అభిప్రాయాన్ని తొలగించి మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా సిబ్బంది మాత్రం మారడం లేదు.ఇలా తాజాగా గుంటూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. వైద్యం అందించకుండా తన ప్రాణాలు తీసేలా వున్నారు... దయచేసి కాపాడండి అంటూ ఓ యువకుడు హాస్పిటల్ బెడ్ పై నుండి సెల్పీ వీడియో ద్వారా వేడుకున్నాడు. న్యూరాలజీ సమస్యతో బాధపడుతూ 10 రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయ్యాయని... గత నాలుగు రోజులుగా మెడిసిన్స్ లేవంటూ ట్రీట్ మెంట్ నిలిపివేసారని మల్లిఖార్జున్ అనే యువకుడు ఆందోళన వ్యక్తం చేసాడు. మెడిసిన్స్ వస్తేనే ట్రీట్ మెంట్... లేదంటే పరిస్థితి ఎలావున్నా డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారని వాపోయాడు. బయటకు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకునే స్థోమత లేదు... ఇక్కడే వుంటే ప్రాణాలు పోయేలా వున్నాయని అన్నారు. తనకు వైద్యం అందేలా చూసి ప్రాణాలు కాపాడాలంటూ యువకుడి కోరుతున్న సెల్సీ వీడియో  బయటకు  వచ్చింది. 

Video Top Stories