Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచకప్ గెలిచిన అండర్-19 టీంలో తెలంగాణ ఆడబిడ్డలు... హైదరాబాద్ లో ఘనస్వాగతం

హైదరాబాద్ : అండర్ 19 ప్రపంచ కప్ గెలిచి మహిళల క్రికెట్ లో తొలి ఐసిసి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది భారత మహిళా జట్టు. ఇలా అద్భుత ప్రదర్శనతో విదేశీ జట్లను మట్టికరిపించిన భారత అండర్ 19 మహిళల జట్టులో ఇద్దరు తెలంగాణ క్రీడాకారిణులుండటం రాష్ట్రానికే గర్వకారణం.

First Published Feb 2, 2023, 3:04 PM IST | Last Updated Feb 2, 2023, 3:04 PM IST

హైదరాబాద్ : అండర్ 19 ప్రపంచ కప్ గెలిచి మహిళల క్రికెట్ లో తొలి ఐసిసి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది భారత మహిళా జట్టు. ఇలా అద్భుత ప్రదర్శనతో విదేశీ జట్లను మట్టికరిపించిన భారత అండర్ 19 మహిళల జట్టులో ఇద్దరు తెలంగాణ క్రీడాకారిణులుండటం రాష్ట్రానికే గర్వకారణం. అండర్ 19 ప్రపంచకప్ విజయం తర్వాత తొలిసారి హైదరాబాద్ కు చేరుకున్న మహిళా క్రికెటర్లు జి. త్రిష, యశశ్రీ లతో పాటు జట్టు ఫిట్ నెస్ ట్రైనర్ శాలినీలకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాదర స్వాగతం పలికారు. యువ క్రికెటర్లు, ఫిట్నెస్ ట్రైనర్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు క్రీడా మంత్రి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆంజనేయ గౌడ్, అధికారులు ధనలక్ష్మి, సుజాత, క్రికెట్ కోచ్ రాజశేఖర్ రెడ్డి, క్రీడాభిమానులు  పాల్గొన్నారు.