Cyclone Asani: శ్రీకాకుళంలో అరుదైన ఘటన... తీరానికి కొట్టుకువచ్చిన విదేశీ రధం

శ్రీకాకుళం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. తుఫాను ప్రభావంతో సముద్రంలో ఎగిసిపడుతున్న అలల వెంట అద్భుతమైన రధం ఒకటి తీరానికి కొట్టుకువచ్చింది. సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి వద్ద అలలపై తేలియాడుతూ బంగారు వర్ణంలో తళతళా మెరిపోతున్న రధాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొదట అది బంగారు రథంగా ప్రచారం జరగడంతో దాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎగబడ్డారు. మందిరం లాంటి రథాన్ని స్థానికులు తాళ్లతో లాగుతూ ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ రధం మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ నుండి కొట్టుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. 
 
Share this Video

Related Video