Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో గంజాయి బ్యాచ్ హల్ చల్... నడిరోడ్డుపై కర్రలు, రాళ్లతో దాడులు

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సోమవారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది.

First Published Sep 27, 2022, 11:01 AM IST | Last Updated Sep 27, 2022, 11:01 AM IST

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సోమవారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గాంధీనగర్ ఐలాపురం సెంటర్లో గంజాయి మత్తులో మునిగిన ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపైనే గొడవకు దిగారు. మత్తులో విచక్షణ కోల్పోయి కర్రలు, రాళ్లతో ఒకరినొకరు రక్తాలు చిందేలా చితకబాదుకున్నారు. రోడ్డుపైనే ఇలా గంజాయి బ్యాచ్ హల్ చల్ చేయడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందిపడ్డారు. గంజాయి బ్యాచ్ గొడవతో ఐలాపురం సెంటర్లో కొద్దిసేపు భయానక వాతావరణం ఏర్పడింది.