సినీ నటుడు బాబీ సింహాకు స్వగ్రామంలో ఘన సన్మానం
విజయవాడ : ప్రముఖ సినీ నటుడు బాబీ సింహాను ఘనంగా సన్మానించారు.
విజయవాడ : ప్రముఖ సినీ నటుడు బాబీ సింహాను ఘనంగా సన్మానించారు. మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన బాబీ సింహా శుక్రవారం స్వగ్రామానికి వచ్చారు. తన బంధువులు అయిన కోసూరు ఆనంద్ గృహానికి వచ్చిన బాబీ సింహాను పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.సర్పంచ్ కోసూరు అనూష, యం.పి.టి.సి సభ్యులు సనకా వెంకటరాజేష్ బాబు, గ్రామ సచివాలయాల మండల కన్వీనర్ కోసూరు శివనాగ మల్లేశ్వరరావు, పి.ఏ.సి.యస్ ల ఛైర్ పర్సన్లు ఆది రాంబాబు, అరజా లక్ష్మీ తులసి, ఉప సర్పంచ్ కోసూరు రాధాకృష్ణ, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మత్తి వెంకట సత్యనారాయణ లతో పాటు పెద్ద సంఖ్యలో బాబీసింహా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.