Asianet News TeluguAsianet News Telugu

జనమంటే జగన్‌కు లెక్కలేదు- రావెల

రాజధాని గ్రామాల రైతుల ఆందోళనకు ఆదివారం బీజేపీ-జనసేన నేతలు సంఘీభావం పలికారు.
 

రాజధాని గ్రామాల రైతుల ఆందోళనకు ఆదివారం బీజేపీ-జనసేన నేతలు సంఘీభావం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రావెల కిశోలర్ బాబు మాట్లాడుతూ.. అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోడీ అన్నారు. శంకుస్థాపన రోజు తాను ఉద్వేగానికి గురి అయ్యానన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర శ్రేయస్సు బాగుంటాయని ఆనాడు అనుకున్నాను రావెల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బుద్దుడు నడయాడిన పవిత్ర భూమని.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందాలని కోరుకున్నాను కిశోర్ బాబు తెలిపారు. ప్రపంచంలోనే అతి గొప్ప రాజధానిగా అమరావతి నిలవాలని కలలు కన్నానని.. మీ పంతాలు,పగలు కోసం ఇక్కడి రైతులతో ఆటలు ఆడుకోవద్దని ఆయన హెచ్చరించారు. ప్రజలంటే సీఎంకు లెక్కలేదని, న్యాయస్థానాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని రావెల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా పాలన వికేంద్రీకరణ కి జీవోలు ఇచ్చారని, తరలింపు చేస్తే...ఆ ఖర్చు మిరే భరించాలని కోర్ట్ ఆదేశించిందన్నారు. రాష్ట్రానికి పట్టిన శకుని జగన్ అని కిశోర్ బాబు మండిపడ్డారు. మండలి రద్దు చెయ్యడానికి శాయశక్తులా కృషి చేసారని, రాజధాని ఎక్కడికి పోదాన్నారు. రైతుల తరపున బీజేపీ,జనసేన ఉంటాయని.. మా రెండు పార్టీలు ఈ సమస్యను భుజస్కంధాలపై మోస్తామని కిశోర్ బాబు తెలిపారు. ఈ నెల 5 వరకు 144 సెక్షన్ ఉందని పోలీసులు చెప్పారని.. వాళ్లు 144 సెక్షన్ పొడిగిస్తే లాంగ్‌మార్చ్ తప్పకుండా నిర్వహిస్తామని రావెల స్పష్టం చేశారు.