తాగుబోతు డ్రైవర్ చేతికి కాలేజ్ బస్సు... విద్యార్థుల ప్రాణాలతో కార్పోరేట్ యాజమాన్యం చెలగాటం
విజయవాడ : లక్షలకు లక్షలు ఫీజులను భరిస్తూ తమ పిల్లలకు మంచి భవిష్యత్ వుంటుందని తల్లిదండ్రులు కార్పోరేట్ విద్యాసంస్థల్లో చదివిస్తుంటారు.
విజయవాడ : లక్షలకు లక్షలు ఫీజులను భరిస్తూ తమ పిల్లలకు మంచి భవిష్యత్ వుంటుందని తల్లిదండ్రులు కార్పోరేట్ విద్యాసంస్థల్లో చదివిస్తుంటారు. కానీ పిల్లల భవిష్యత్ అంటుంచి ఇప్పుడే వారి ప్రాణాలు పోయేలా వ్యవహరిస్తున్నాయి కార్పోరేట్ యాజమాన్యాలు. ఇప్పటికే చదవుల పేరిట ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నది కొందరయితే, కాలేజీల యాజమాన్యాల నిర్లక్ష్యంతో మరికొందరు విద్యార్థులు బలవుతున్నారు. కాసుల కోసం విద్యాసంస్థలు చివరకు ఎంతకు దిగజారారంటే 40 మందికి పైగా విద్యార్థులను ఓ తాగుబోతు డ్రైవింగ్ చేస్తున్న బస్సులో ఎక్కించారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.