Mahakumbh Mela 2025: త్రివేణి సంగమం వద్ద మహా హారతి

Galam Venkata Rao  | Published: Jan 21, 2025, 12:59 AM IST

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభ మేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మంది సాధువులు, సన్యాసులు, స్వామీజీలు తరలి వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి 144 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాలో పాల్గొని.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. అపూర్వమైన సంగమ హారతి అందుకొని తరిస్తున్నారు.