
బాబుపై కేంద్రానికి కంప్లైంట్ చేస్తాం: YV Subbareddy on Ambati Rambabu issue
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడిని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఈ దాడిని చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.