Asianet News TeluguAsianet News Telugu

ఇళ్ల పట్టాల పంపిణీ: వేదికపై పడిన కొబ్బరి చెట్టు, ఇద్దరు మృతి (వీడియో)

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇరగవరం మండలం రేలంగి శివారు గవర్లపాడులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుండగా టెంటుపై కొబ్బరి చెట్టు కూలి పడింది . 

ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కాసాని దుర్గా భవాని(30), శాంతకుమారి(35) అనే ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన ఆరుగురి పరిస్ధితి నిలకడగా వుంది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 
 
Video Top Stories